99 రోజుల 'ప్రజా కళలు'  భారీ అవకతవకలా?.. శ్వేతపత్రం విడుదల చేయాలి: భూపతి వెంకటేశ్వర్లు

విశ్వంభర, హైదరాబాదు: భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 99 రోజుల "ప్రజా కళలు" కార్యక్రమంలో భారీ అవకతవకలు జరిగాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రజల సొమ్ముతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం రూపంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, సకల కళల జేఏసీ సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జానపద, గిరిజన, సంప్రదాయ కళాకారులను పక్కనపెట్టి కార్యక్రమాలు నిర్వహించడం ప్రజా కళల ఆత్మను దెబ్బతీయడమేనన్నారు. కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్, ఇప్పటివరకు చేసిన ఖర్చు, కళాకారుల ఎంపిక విధానం, పారితోషికాల వివరాలు, జిల్లాల వారీగా ఎంపిక జాబితాను సమాచార హక్కు చట్టం ప్రకారం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సకల కళల జేఏసీ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, ప్రజల సొమ్ముతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పారదర్శకత లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కళాకారుల ఎంపికలో ఏ ప్రమాణాలు పాటించారో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. సకల కళల జేఏసీ ఉపాధ్యక్షుడు గూరుజీ సాధు మహారాజ్, జానపద సకల కళల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్య మాట్లాడుతూ, గ్రామీణ జానపద కళాకారులను పూర్తిగా విస్మరించడం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కళాకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా "జానపద కళలకు అవకాశం లేని 99 రోజుల ప్రజా కళలు కార్యక్రమం సిగ్గు సిగ్గు" అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం రాజయ్య, కొల జనార్ధన్, బీసీ కళాకారుల జేఏసీ చైర్మన్ వి. కురుమూర్తి, ఖాజా మొహీనుద్దీన్, దాట్ల నిర్మల, తాండ్ర స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/99-days-public-art-%C2%A0massive-irregularities-white-paper-should-be/article-18340

Tags: