అభివృద్ధి కనిపించకపోతే కంటి పరీక్షలు చేయించుకోండి: బీఆర్ఎస్ నాయకులు
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మహేశ్వరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే రాజీనామా కోరే హక్కు బీజేపీకి లేదన్నారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి సబితా ఇంద్రారెడ్డి విశేష కృషి చేశారని, అది కనిపించకపోతే కంటి పరీక్షలు చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నియోజకవర్గానికి తీసుకొచ్చిన అభివృద్ధి పనులు ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. మహేశ్వరం గేట్ నుంచి సెంట్రల్ లైటింగ్, బస్ డిపో, ఫైర్ స్టేషన్, మోడల్ స్కూల్, ఫార్మసీ కళాశాల, డిగ్రీ కళాశాల, కోర్టు భవనాలు, గురుకుల పాఠశాలలు, పారిశ్రామిక వాడలు, రహదారుల విస్తరణ, 100 పడకల ఆస్పత్రి, వ్యవసాయ మార్కెట్, ఓపెన్ జిమ్‌లు తదితర అభివృద్ధి పనులు ఎమ్మెల్యే హయాంలో జరిగాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యేపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంగోతు రాజు నాయక్, సర్పంచ్ నవీన్, కర్రేళ్ల చంద్రయ్య ముదిరాజ్, అంబయ్య యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.