ప్రభుత్వ భూముల పై కాంగ్రేస్ నేతల కన్ను!
-మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి ధ్వజం
విశ్వంభర, ఇబ్రహీంపట్నం: అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూర్ గ్రామంలోని సర్వే నెం. 44లో కబ్జాకు గురైన రూ. 200 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మునగనూర్ సర్వే నెం. 44లో ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ భూమి గత 70 సంవత్సరాలుగా ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొందరి దృష్టి ఈ భూమిపై పడుతుందని గుర్తించి, "ఇది ప్రభుత్వ భూమి" అని బోర్డులు ఏర్పాటు చేయించాం. 15 సంవత్సరాల పాటు ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా ఈ భూమిని కాపాడాం. భవిష్యత్తులో కాలనీవాసుల అవసరాల కోసం వినియోగించాలని భావించాం. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కొందరు అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. మొదట ఈ వ్యవహారంపై ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు వచ్చినా, తర్వాత రాజీ కుదుర్చుకుని పక్కా ప్రణాళికతో కబ్జా చేశారు. ముందుగా కంబాలపల్లి సులోచన పేరుపై, అనంతరం గోపాల్ పేరుతో రాత్రికి రాత్రే అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్లు జరిపించారు. ఈ వ్యవహారం వెనుక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సోదరుడు కీలక పాత్ర పోషించారు. 15 సంవత్సరాలుగా ఎలాంటి వివాదం లేని ప్రభుత్వ భూములు ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు కబ్జాలకు గురవుతున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం "దోచుకో... దోచింది దాచుకో" అనే విధానంతో వ్యవహరిస్తోందనే అనుమానం ఉంది. ఇలాంటి అక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా నియోజకవర్గంలో చాలా చోట్ల ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. మున్ముందు అన్నీ బయటపెడతాం. అధికారులకు స్పష్టమైన హెచ్చరిక మీరు 30-40 సంవత్సరాలు ప్రభుత్వ సేవలో ఉంటారు. ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉండే రాజకీయ నాయకుల కోసం ప్రభుత్వ భూములను కబ్జా చేయించి మీ ఉద్యోగాలను, మీ జీవితాలను ప్రమాదంలో పాడేసుకోవద్దు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన చివరి వరకు పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దండెం రాంరెడ్డి, వంగేటి లక్ష్మా రెడ్డి, బిందు రంగా రెడ్డి ప్రభువర్ధన్ రెడ్డి, పూజారి చక్రవర్తి, శంకర్ నాయక్, శ్రీకాంత్ రెడ్డి, గౌతం రెడ్డి, స్థానిక మాజీ కౌన్సిలర్ మోహన్, అబ్దుల్లాపూర్ మెట్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొత్త కిషన్ గౌడ్, మరియు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలని వాసులు, స్థానిక ప్రజలు, పాల్గొన్నారు.