యూట్యూబ్‌లో నేర్చుకుని అక్రమ వైన్ తయారీ

యూట్యూబ్‌లో నేర్చుకుని అక్రమ వైన్ తయారీ

విశ్వంభర, మల్కాజిగిరి: ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దాడుల్లో మల్కాజిగిరిలో ఏడాదిగా అక్రమంగా వైన్ తయారు చేస్తున్న ఆంటోనీ ఫీటర్‌ను అధికారులు పట్టుకున్నారు. యూట్యూబ్‌లో చూసి వైన్ తయారీ నేర్చుకున్న నిందితుడు ద్రాక్ష, అనాస, జామ, మోసంబి, సపోటా, అరటి, తమలపాకుతో ఏడు రకాల వైన్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. దాడుల్లో 377.7 లీటర్ల వైన్, 502 బాటిళ్లు, తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని కాప్రా ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. మరోవైపు కేపీహెచ్‌బీ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయాలపై వచ్చిన సమాచారంతో ఎస్టీఎఫ్ డి బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడిలో కొత్త యశ్వంత్ కుమార్ (25) వద్ద నుంచి 2.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని కుకట్‌పల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. అక్రమ వైన్ తయారీ కేంద్రాన్ని గుర్తించి భారీగా వైన్ స్వాధీనం చేసుకున్న డీటీఎఫ్ బృందాన్ని మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ ప్రణవి, ఈఎస్ బి. హన్మంతరావు అభినందించారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/illegal-winemaking-learned-on-youtube/article-18375

Tags: