ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి: ఎంపీ ఆర్ కృష్ణయ్య

విశ్వంభర, హైదరాబాదు : 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలైన రూ.8 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలి. ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను బలహీనపరిచే చర్యలు నిలిపివేయాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. హైదరాబాదు హిమాయత్‌నగర్ నుంచి బషీర్‌బాగ్‌ వరకు నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, దీనివల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆయన విమర్శించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల విద్యాభివృద్ధికి అమలవుతున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయకుండా తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లపల్లి అంజి, పగిళ్ల సతీష్, నీల వెంకటేష్, అనంతయ్య, రాజేందర్, భీమ్రావు, మోడీ రాందేవ్, శివకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/fee-reimbursement-arrears-should-be-released-immediately-mp-r-krishnaiah/article-18377

Tags: