మాలపల్లిలో ఓటరు హక్కుల పరిరక్షణపై అవగాహన
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ మండలంలోని మాలపల్లి గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎంపీడీవో సురేష్ పరిశీలించారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రతి అర్హత ఓటర్ ఓటు హక్కు కల్పించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఓటరు జాబితా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, సీసీ రోడ్లు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, ఓపెన్ జిమ్, డంపింగ్ షెడ్‌లను పరిశీలించారు. అలాగే నూతనంగా నిర్మించనున్న న్యాక్ సెంటర్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని సందర్శించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెన్న స్వర్ణలత, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్న రాజు, ఉపసర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని రాజ్‌కుమార్ గౌడ్, గ్రామ కార్యదర్శి దివ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మామిడి తిరుపతి, కాంగ్రెస్ నాయకులు భూక్య రమేష్ నాయక్, హనుమండ్ల శ్రీకాంత్ రెడ్డి, బి ఎల్ ఓ సరోజన, బి ఎల్ ఎ వెన్న మల్లికార్జున్, ఈజీఎస్ మేట్లు వెన్న శ్రీమతి, బత్తుల రాణి, గ్రామస్తులు పాల్గొన్నారు.