హుస్నాబాద్ అమరుల స్థూప స్థల సాధన కమిటీ ఏర్పాటు

  •  స్థూపం స్థల పరిరక్షణకు ఐక్య పోరాటం

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి భవనంలో బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ, బీఆర్ఎస్, కాంగ్రెస్,బి ఎస్ పి పార్టీ ప్రతినిధులతో పాటు వివిధ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆక్రమించబడిన అమరుల స్థూపం స్థలాన్ని పరిరక్షించి తిరిగి సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల భాగస్వామ్యంతో "హుస్నాబాద్ అమరుల స్థూప స్థల సాధన కమిటీ"ని ఏర్పాటు చేశారు. కమిటీ ఛైర్మన్‌గా కవ్వ లక్ష్మారెడ్డి, కో-ఛైర్మన్‌లుగా గడిపే మల్లేష్, ఎంఏ. అన్వర్, జెరిపోతుల ఆంజనేయులు, పచ్ఛిమట్ల రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా మేకల వీరన్న యాదవ్, కార్యదర్శులుగా గూడెం లక్ష్మి, తోడేటి రమేష్, బండి పుష్ప, జంగ విజయ, గజవెల్లి మురళి, పెట్టెం కుమారస్వామి, ప్రచార కార్యదర్శులుగా గాదెపాక రవి, డ్యాగల సారయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి చారిత్రాత్మక చిహ్నమైన అమరుల స్థూపం స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ఆక్రమణకు గురైన స్థలాన్ని చట్టబద్ధంగా తిరిగి సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, ప్రజలు ఐక్యంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ఉద్యమ కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామని,అమరుల త్యాగాలకు గుర్తుగా నిలిచిన స్థూపం స్థల పరిరక్షణ కోసం నిరంతరంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా గాజాగిరి సత్యనారాయణ, నాంపల్లి సమ్మయ్య, పెద్ది నిర్మల, పూదరి రవీందర్, అయిలేని మల్లారెడ్డి, తిరుపతి నాయక్ వేల్పుల, శ్రీనివాస్, కోహెడ కొమురయ్య, దండుగుల ఎల్లయ్య, గూడ పద్మ, గంబీరపు మధు, జనగామ రాజకుమార్, అందే స్వామి, నాగేల్లి లక్ష్మారెడ్డి, కనుకుంట్ల శంకర్, బత్తుల బాబు, కళ్యాణ్, ఆదరి శ్రీనివాస్, చుంచు కుమారస్వామి, అందే అశోక్, బెక్కంటి సంపత్, కొడిముంజ లక్ష్మణ్ లను ఎన్నుకున్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/establishment-of-husnabad-amarula-stupa-sthal-sadhana-committee/article-18396

Tags: