కోర్టు స్టే ఉల్లంఘించి నిర్మాణాలు.. చర్యలు తప్పవు: హైడ్రా

విశ్వంభర, గచ్చిబౌలి :  హైదరాబాదు, గచ్చిబౌలిలోని ఎఫ్‌సీఐ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం లేఅవుట్‌ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, సీఎంసీ కమిషనర్ సృజన బుధవారం పరిశీలించారు. హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదులపై వారు క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు. లేఅవుట్‌లో రహదారులు, పార్కుల హద్దులను దాటి తవ్వకాలు, భూమి చదును చేసే పనులు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. రహదారులు, పార్కులు సీఎంసీకి చెందినవని, వాటిని పరిరక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, సీఎంసీ అధికారులు, జోనల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఎఫ్‌సీఐ లేఅవుట్ ప్లాట్ యజమానులు పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/violation-of-court-stay-and-constructions-will-not-be-actionable/article-18338

Tags: