ఆహార భద్రతా చట్టంలో ప్రతిపాదించిన సవరణలను  ఉపసంహరించుకోవాలి

విశ్వంభర, హైదరాబాదు : జాతీయ ఆహార భద్రతా చట్టంలో ప్రతిపాదించిన సవరణలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, పేదలు, వికలాంగుల ఆహార భద్రతకు భంగం కలిగించే నిర్ణయాలను విరమించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమం చేపడతామ ని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కో-కన్వీనర్ కాటమోని వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కుటుంబ ప్రాతిపదికన అమలవుతున్న అంత్యోదయ అన్న యోజన విధానంలో మార్పులు చేస్తే వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, గిరిజనులు, చిన్న కుటుంబాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. 2011 జనగణన ఆధారంగా ఉన్న లబ్ధిదారుల జాబితాను నవీకరించి అర్హులైన కుటుంబాలకు ఆహార భద్రత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం, పేదల హక్కులను బలహీనపరిచే సవరణలు తీసుకురావడం సరికాదన్నారు. వికలాంగుల కుటుంబాలకు అంత్యోదయ రేషన్ కార్డుల ద్వారా లభిస్తున్న ప్రయోజనాలను కొనసాగించాలని, ప్రతిపాదిత సవరణలను వెంటనే ఉపసంహరించు కోవాలని కోరారు. లేనిపక్షంలో పేదలు, వికలాంగులను సమీకరించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-proposed-amendments-in-the-food-security-act-should-be/article-18406

Tags: