మెరుగైన ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలి

మెరుగైన ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలి

  • విద్యార్థినులకు అల్పాహారం, భోజనం
  • డీఐఈఓ రవీందర్ రెడ్డి

విశ్వంభర, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవీందర్ రెడ్డి హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలకు సంబంధించిన పరిపాలనా, విద్యా రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ వి. లలిత, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో సమావేశమై ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఇంటర్మీడియట్ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. గత విద్యా సంవత్సరంలో కళాశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని, రాష్ట్ర ర్యాంకులు సాధించిన విద్యార్థినులను ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ సేవా పథకం  ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ ప్రిన్సిపాల్ నల్ల రామచంద్ర రెడ్డి సేవాకాలానికి సంబంధించిన రికార్డుల పరిశీలన కోసం నియమితులైన హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. గంగాధర్, చేర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్  వి. లలిత, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సి.హెచ్. గంగాధర్, చేర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ చక్రవర్తి, అధ్యాపకులు డి. రవీందర్, ఎస్. సదానందం, టి. నిర్మలదేవి, బి. లక్ష్మయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డి. కరుణాకర్, ఎ. సంపత్, ఎస్. కవిత, కె. స్వరూప, జి. కవిత, ఆస్మా ఫిర్దోస్, ఓ. రాణి, జూనియర్ అసిస్టెంట్లు కె. గీతాంజలి, ఎస్. రాములు, రికార్డు అసిస్టెంట్ టి. రమాదేవి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/aim-for-better-results/article-18357

Tags: