అమర్నాథ్ అన్నదాన సేవలు ఆదర్శం
విశ్వంభర, సిద్దిపేట : అమర్‌నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట (తెలంగాణ), అమర్‌నాథ్ సేవ మండలి, అమృత్‌సర్ (పంజాబ్) సంయుక్త ఆధ్వర్యంలో అమర్‌నాథ్ యాత్రికులకు బాల్తాల్ లంగర్ నెంబర్ 8వద్ద గత 15రోజులుగా నిరంతరంగా ఉచిత అన్నప్రసాదం, అల్పాహారం, వసతి అవసరమైన సేవలు అందిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో ఛైర్మన్ చీకోటి మధుసూదన్, గౌరవ అధ్యక్షుడు కాచం కాశీనాథ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వయంగా పర్యవేక్షిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేస్తూ, అవసరమైన సూచనలు అందిస్తూ విశిష్ట సేవలు అందించారు. 15రోజులపాటు సేవా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని బుధవారం స్వగ్రామానికి చేరుకోగా, అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాంకాల నవీన్ కుమార్. సహాయ కార్యదర్శి చింత శ్రీనివాస్, పీఆర్వో పోశెట్టి శ్రీకాంత్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయి. వీరితో పాటు సభ్యులు నేతి కైలాసం, గ్యాదరి పరమేశ్వర్, కొలిశెట్టి క్రాంతి కుమార్, చిత్తలూరి వేణుమాధవ్, రేడిశెట్టి చంద్రం తదితరులు ఉన్నారు. సేవలు కేవలం బాల్తాల్ లంగర్ నంబర్ 8కే పరిమితం కాకుండా పంచతరణి లంగర్ నంబర్-2, అమర్నాథ్ గుహ సమీపంలోని లంగర్ నంబర్-28లోని మూడు ప్రాంతాల్లో అన్నప్రసాద కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రతిరోజూ సుమారు 20వేల మందికి పైగా యాత్రికులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ చీకోటి మధుసూదన్ మాట్లాడుతూ "మంచుకొండల్లో వెలసిన పవిత్ర అమర్నాథ్ గుహలోని మంచు లింగాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతమన్నారు. అలాంటి పవిత్ర క్షేత్రంలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించే అవకాశం లభించడం మా అదృష్టంగా, దైవానుగ్రహంగా భావిస్తున్నామని సంతోషం వ్యక్తంచేశారు. దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా తెలుగు లంగర్‌ను మన సిద్దిపేట నుంచి నిర్వహించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని తెలిపారు. యాత్రికుల కోసం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 12గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఉదయం టీ, కాఫీ, బిస్కెట్లు, ఇడ్లీ, దోసె, వడ, అటుకులు, ఉప్మా, పొంగలి, చట్నీ, సాంబార్, మధ్యాహ్నం అన్నం, పప్పు, సాంబార్, కూరలు, ఆవకాయ పచ్చడి, మజ్జిగ, పాపడ్, సళ్ళమిర్చి, స్వీట్, సాయంత్రం టీ, కాఫీ, చాట్, పకోడీ, పునుగులు, పావ్‌భాజీ, బాదం పాలు రాత్రి తెలుగువారి సంప్రదాయ భోజనంతో పాటు రోటీ, కుల్చా, ఊతప్పం, అన్నం, పప్పు, చారు, మామిడికాయ పచ్చడి, నాలుగు రకాల కూరలతో భోజనం అందిస్తున్నట్టు తెలిపారు.