ఆహార భద్రతా చట్ట సవరణలను ఉపసంహరించుకోవాలి: ఎన్‌పీఆర్‌డీ
విశ్వంభర, షాద్‌నగర్: జాతీయ ఆహార భద్రతా చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగారెడ్డి డిమాండ్ చేశారు. అంత్యోదయ అన్న యోజనలో కుటుంబ ప్రాతిపదిక అర్హతను తొలగించి వ్యక్తి ప్రాతిపదిక విధానాన్ని అమలు చేయడం వల్ల పేదలు, వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, గిరిజనులు, భూమిలేని వ్యవసాయ కూలీలు వంటి బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన అన్నారు. అలాగే 2011 జనగణన ఆధారంగా కొనసాగుతున్న లబ్ధిదారుల జాబితాను ప్రస్తుత జనాభా ప్రకారం నవీకరించి అర్హులైన వారందరికీ ఆహార భద్రత కల్పించాలని కోరారు. ప్రతిపాదిత సవరణలు ఆహార భద్రత హక్కును బలహీనపరుస్తాయని పేర్కొన్న ఆయన, కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు, పేద ప్రజలతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.