తొక్కుడు బండల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి
- రేకొండలో నాయకులు,రైతులు, గ్రామస్తుల నిరసన
విశ్వంభర, చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, గ్రామస్తులు, పలువురు నాయకులతో కలిసి నిరసన చేపట్టారు. రేకొండ గ్రామం నుండి ఎగ్లాస్ పూర్ గ్రామానికి వెళ్లే తొక్కుడు బండలవాగు పై బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ టెంటు వేసుకొని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వాగు పై బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలంలో వాగు ప్రవాహం పెరిగి వాగుకు అవతలి వైపుకు ఉన్న ఊర్లకు, పంట పొలాలకు వెళ్లడానికి ఇబ్బందిగా మారుతోందని రైతులు, గ్రామస్తులు వాపోయారు. వాగులో ఉన్న బండలు నీటి ప్రవాహానికి పాకురు పడుతుండడంతో వాటిపై నుండి వెళ్తున్న వాహనదారులు, రైతులు జారిపడి తీవ్ర గాయాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాగు ప్రవాహం పెరిగిన సమయంలో అవతలి వైపు వెళ్లడానికి 10 నుండి 15 కిలోమీటర్ల దూరం తిరిగి ప్రయాణించాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా గ్రామం చుట్టూ ఉన్న లో లెవెల్ రహదారులపై కూడా బ్రిడ్జిలను నిర్మించాలని కోరారు. వెంటనే ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి బ్రిడ్జిల నిర్మాణం చేపట్టి తమ ఇబ్బందులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రిడ్జ్ ల నిర్మాణానికి నిధులు మంజూరైన ఇంతవరకు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టలేదని బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. వెంటనే గ్రామంలో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టకుంటే తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, గులాపూర్ మాజీ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, నాయకులు ఎరుకొండ తిరుపతి, కల్వల సంపత్ రెడ్డి, జున్నూరు రవి, వర్ణ వెంకటరెడ్డి, కోరండ్ల లక్ష్మారెడ్డి, గాదపాక నారాయణ, అందె దర్శనం, బిల్లా సంపత్ రెడ్డి, ఏరుకొండ వెంకట మల్లు, జున్నూరు కుమార్, సుధ గోని రాయమల్లు,కొడముంజ శ్రీనివాస్, రైతులు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.