రాము తండాలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని రాము తండాలో సర్పంచి మీటు నాయక్ కృషితో బాలవికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ బుధవారం ఓపెన్ చేశారు. దీనిని ఆ గ్రామ సర్పంచి మీటు నాయక్ బుధవారం బాలవికాస ప్రతినిధులు ఈమల్ ,పసునూరి రెడ్డి,మధు రెడ్డి, బాలవికాస ఫౌండేషన్ సభ్యులు ఊకంటి యాకూబ్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచి మీటు నాయక్ మాట్లాడుతూ నీటి శుద్ధి యంత్రం ఏర్పాటుతో తండావాసులకు స్వచ్ఛమైన మంచినీరు లభిస్తుందని తెలిపారు. కాలానుగుణంగా వచ్చే సీజనల్ వ్యాధులు ,ఇతర నీటి సమస్యలతో వచ్చే జబ్బుల బారిన పడకుండా తండావాసులకు ఉపశమనం లభిస్తుందని చెప్పారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం తమ రాము తండా ప్రజలు ముందుకు వచ్చి గదిని ఏర్పాటు చేసుకోవడం పట్ల గర్వంగా ఉందని గ్రామస్తులను అభినందించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తండావాసులు హాజరయ్యారు.