ఆల్ఫోర్స్ అధినేత  నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్‌లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి 56వ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. వీఎన్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, మొక్కల నాటడం కార్యక్రమాలు చేపట్టగా, మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం 56 మొక్కలు నాటి, విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, డాక్టర్ వి. నరేందర్ రెడ్డి విద్యతో పాటు సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/birthday-celebrations-of-alforce-chief-narender-reddy/article-18350

Tags: