చెత్తతో పంచాయతీకి ఆదాయం
విశ్వంభర, సిద్దిపేట : రూరల్ మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లి గ్రామం రికార్డు సృష్టించింది. చెత్తను అమ్మి ఆదాయాన్ని సంపాదించింది. గ్రామంలోని ప్రతీ ఇంటి నుంచి సేకరించిన తడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి 2500కిలోల సేంద్రియ ఎరువును తయారుచేశారు. ఎరువును గ్రామ సర్పంచ్ బట్టు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం విక్రయించగా పంచాయతీకి 17500 రూపాయల ఆదాయం సమకూరింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతీ ఇంటి నుంచి చెత్తను నాలుగు భాగాలుగా వేరు చేసి సేకరిస్తున్నామన్నారు. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. చెత్తను వ్యర్థంగా కాకుండా ఆదాయ వనరుగా మలుస్తామని చెప్పారు. సేంద్రియ ఎరువుల తయారీ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించి గ్రామపంచాయతీకి అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు చర్యలు చేపడుతామని వివరించారు.