సోషల్ మీడియా లేఖపై బీజేపీలో దుమారం
- రాష్ట్ర అధ్యక్షుడిని ఆశ్రయించిన శంకర్ బాబు
విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్ బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా తనను తొలగించినట్లు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన లేఖపై బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల బీజేపీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పేరుతో తనను పట్టణ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్లు శంకర్ బాబు తెలిపారు. దీనిపై స్పందించిన రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఆ లేఖ విషయం తన దృష్టికి రాలేదని, ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై పార్టీ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపైనా చర్యలు ఉంటాయని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఇలాంటి ప్రచారాలను పట్టించుకోకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ బాబుకు సూచించినట్లు సమాచారం.