ఆర్టీసీ విలీనంతోనే ఉద్యోగుల భవిష్యత్తు
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా ఎన్నికల కంటే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడమే అత్యవసర మని బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ సంపత్ ముదిరాజ్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వెంటనే అపాయింటెడ్ డే ప్రకటించి విలీన ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఎన్నికలు వద్దు – విలీనం ముద్దు" అంశంపై రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంఘాలన్నీ విభేదాలను పక్కనపెట్టి ఆర్టీసీ విలీన సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు సాజిద్ మహమ్మద్ మాట్లాడుతూ, బహుజన వర్కర్స్ యూనియన్ ఇప్పటికీ "ఎన్నికలు వద్దు – విలీనం ముద్దు" అనే నినాదానికే కట్టుబడి ఉందన్నారు. ఎన్నికలు ముందుగా నిర్వహిస్తే విలీనం మరింత ఆలస్యమై పలువురు ఉద్యోగులు పదవీ విరమణ చేసి నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జేఏసీ నిర్ణయం అనంతరం అన్ని సంఘాలను కలుపుకొని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ మాట్లాడుతూ, ఆర్టీసీ విలీనం కోసం అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి రావాలని కోరారు. విలీన సాధన కోసం ప్రాణత్యాగం చేసిన కార్మికుల ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి సంఘంపై ఉందన్నారు. సమావేశంలో పాల్గొన్న పలు కార్మిక సంఘాల ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు, బీసీ అసోసియేషన్ నాయకులు కూడా ఆర్టీసీ విలీనానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అదనపు కార్యదర్శి గౌడ రవికిరణ్, దుర్గేష్, నరేందర్, రాంచందర్, ఎస్‌డబ్ల్యూయూ-ఐఎన్‌టీయూసీ నాయకుడు జక్కుల మల్లేశం, టీజేఎంయూ నాయకుడు హనుమంత్ ముదిరాజ్, ఎస్‌టీఎంయూ నాయకుడు పున్నా హరికిషన్, సురేష్, రాజయ్య నాయక్, వల్లూరి బాబు, అంబదాస్ తదితరులు పాల్గొన్నారు.