వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. పీహెచ్‌సీ రిపేర్లకు రూ.14.30 లక్షలు
- నూతనకల్ పీహెచ్‌సీని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
విశ్వంభర, సూర్యాపేట: ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. నూతన్ కల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నూతనంగా నిర్మిస్తున్న సబ్ సెంటర్ భవనాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణపై సిబ్బందిని ఆరా తీశారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్‌తో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్ని ఏఎన్సీ కేసులు నమోదయ్యాయి? పీహెచ్‌సీలో ఎన్ని డెలివరీలు చేశారు? అని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఫీవర్ సర్వే జరుగుతుందా? ఎన్ని జ్వర కేసులు నమోదయ్యాయి? అని ఆరా తీశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని జనరల్ వార్డు, లేబర్ రూమ్, ఫార్మసీ, మెడికల్ ఆఫీసర్ రూమ్, మీటింగ్ హాల్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి శుభ్రతపై పలు సూచనలు చేశారు. మెడిసిన్ స్టాక్ రికార్డ్, ఏఎన్సీ రిజిస్టర్, బర్త్ ప్లాన్ రిజిస్టర్లను స్వయంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ అప్‌డేట్‌గా ఉండాలని ఆదేశించారు. పీహెచ్‌సీ భవనం పరిస్థితిని గమనించిన కలెక్టర్ రిపేర్ల కోసం తక్షణమే రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటికి అదనంగా పీహెచ్‌సీ వద్ద ఉన్న రూ.4.30 లక్షల నిధులను కూడా భవన మరమ్మతులకే వినియోగించు కోవాలని సూచించారు. వెంటనే జేఏఎస్ మీటింగ్ నిర్వహించి, పనులు ప్రారంభించాలని మెడికల్ ఆఫీసర్, పంచాయతీ రాజ్ ఏఈని ఆదేశించారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. కార్యక్రమం లో ఆర్డిఓ వేణు మాధవరావు, మెడికల్ ఆఫీసర్ ఆశ్రత రెడ్డి, సిహెచ్ఓ చరణ్, నూతనకల్, తాసిల్దార్ శ్రీనివాసరావు మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.