ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు

విశ్వంభర, మహేశ్వరం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా మహేశ్వరం మండల కేంద్రంలో ఆయన విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాకి ఈశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్వంత ఖర్చులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, వైఎస్ఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/77th-birth-anniversary-celebrations-of-ys-rajasekhar-reddy/article-18404

Tags: