ఏటీసీ సెంటర్ భూమి పూజకు ముమ్మరంగా ఏర్పాట్లు
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి రెవెన్యూ శివారు, గాంధీనగర్ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించనున్న ఏటీసీ సెంటర్ భూమి పూజ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో నిర్మాణ స్థలాన్ని చదును చేసే పనులను కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ ఏర్పాట్లను ఏటీసీ సెంటర్ ప్రిన్సిపల్, కాంట్రాక్టర్ సైట్ ఇంజనీర్, గాంధీనగర్ సర్పంచ్ పోలు సంపత్, హుస్నాబాద్ ఏఎంసీ వైస్ చైర్మన్ బంక చందు తదితరులు పరిశీలించి పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమానికి అన్ని పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.