విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలి
విశ్వంభర, హైదరాబాదు : రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జూలై 10న వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, యువత విజయవంతం చేయాలని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాదులో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యాశాఖకు మంత్రిని వెంటనే నియమించాలని, ప్రభుత్వ పాఠశాలల విలీనం, మూసివేత నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టడంతో పాటు పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 10న జరిగే విద్యాసంస్థల బంద్‌కు అన్ని వర్గాలు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.ఎల్. మూర్తి, ఎండీ. జావీద్, నాయకులు దేవేందర్, రాజు, రాంటెంకి శ్రీను పాల్గొన్నారు.