సర్ ప్రక్రియ గడువు పొడిగించాలి: సామాజికవేత్త కుమారస్వామి

విశ్వంభర, తొర్రూరు: ఓటర్లకు సంబంధించిన "సర్" (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ఫారాల పంపిణీ, సేకరణ నెమ్మదిగా సాగుతున్నందున గడువు తేదీని పొడిగించాలని కోరుతూ సామాజికవేత్త దొనికెన కుమారస్వామి మండల తహసీల్దార్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ అధిక శాతం ఓటర్లకు సర్ ఫారాలు అందలేదని, ప్రస్తుతం ఉన్న గడువులో ప్రక్రియ పూర్తికావడం కష్టమని అన్నారు. అందువల్ల ఎన్నికల సంఘం గడువును పెంచి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఓటర్లు ఈసీఐ నెట్  యాప్ లేదా ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని, సందేహాల నివృత్తికి 1950 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sociologist-kumaraswamy-should-extend-the-deadline-of-sir/article-18316

Tags: