అనురూప్ రెడ్డి కుంటుంబానికి అండగా ప్రభుత్వం 

  •  రూ.10 లక్షల  సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎంపీ చామల

విశ్వంభర, ఇబ్రహీంపట్నం:  అమెరికాలోని లూసియానా టోరొడో పార్క్ వద్ద ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను ప్రాణాలకు తెగించి కాపాడి, దురదృష్టవశాత్తు ప్రాణాలు విడిచిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామానికి చెందిన కోడూరు అనురూప్ రెడ్డి (23) భౌతికకాయం జూన్ 9న స్వగ్రామానికి చేరుకుంది. ఎంపీ చామల ప్రత్యేక చొరవతో అనురూప్ రెడ్డి భౌతికకాయం త్వరగా స్వదేశానికి వచ్చేలా ఇండియన్ ఎంబసీ, తెలంగాణ ఎన్.ఆర్.ఐ విభాగంతో నిరంతరం సంప్రదింపులు జరిపి, ప్రభుత్వ ప్రోటోకాల్ శాఖ ప్రత్యేక అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని విమానాశ్రయం నుండి కవాడిపల్లికి తరలింపజేశారు. స్నేహితుల ప్రాణాలు కాపాడేందుకు అత్యంత సాహసోపేతంగా ప్రాణత్యాగం చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ అనురూప్ రెడ్డి వీరత్వాన్ని కొనియాడుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అధికారిక ప్రశంసా పత్రాన్ని పంపారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే అనురూప్ చూపిన ధైర్యం, మానవత్వం యావత్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు. ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించి  అనురూప్ అకాల మరణంతో తీరని లోటులో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం తరఫున మంజూరైన రూ. 10 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/government-stands-by-anuroop-reddys-family/article-18314

Tags: