సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

విశ్వంభర, సిద్దిపేట : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణకు అర్హత కల్గిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులు జూలై 12లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రూ.3లక్షలు లోపు ఆదాయం కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్ tsstudycircle.co.in దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 19తేదీన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుందన్నారు. పరీక్షలో ఎంపికైన మెరిట్ విద్యార్థులకు భోజన వసతితో కూడిన శిక్షణ ఉంటుందన్నారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/invitation-of-applications-for-civil-free-training/article-18385

Tags: