డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన  ఎస్పీ డాక్టర్ శబరీష్

విశ్వంభర, డోర్నకల్:   మహబూబాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరిష్ బుధవారం డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణ, రిసెప్షన్, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించి దర్యాప్తు వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రతి కేసును బాధ్యతాయుతంగా విచారించాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరమైన పరిష్కారం చూపాలని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పోలీసింగ్ ఉండాలని, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలని సూచించారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా, నేరాలను ముందుగానే నిరోధించేందుకు  ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాలు, తండాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తూ శాంతిభద్రతలను కాపాడాలని పేర్కొన్నారు. ప్రతి కేసు, ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు పురోగతి, స్టేషన్ దినచర్యలు, ఇతర ఆన్‌లైన్ రికార్డులను ఎప్పటికప్పుడు 100 శాతం నమోదు చేయాలని, ఎలాంటి పెండింగ్ ఉండరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రతి గ్రామంలో, పాఠశాలలు, కళాశాలలు,, యువజన సంఘాల వద్ద విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. డిజిటల్ అరెస్టు మోసాలు, లోన్ యాప్‌లు,  మోసాలు, పెట్టుబడి మోసాలు, సోషల్ మీడియా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రాత్రి వేళల్లో బ్లూ కోల్ట్స్, మొబైల్ పెట్రోలింగ్, బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, చోరీలు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. విలేజ్ పోలీస్ అధికారులు  గ్రామస్థాయిలో ప్రజలతో సమన్వయం పెంచుకొని స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల సహకారంతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం, కేసుల దర్యాప్తులో జాప్యం, ఆన్‌లైన్ అప్‌డేట్లలో ఆలస్యం, ప్రజలతో అమర్యాదకరంగా ప్రవర్తించడం వంటి అంశాలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. ప్రతి అధికారి, ప్రతి పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.

🕒 09 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sp-dr-sabreesh-who-made-a-surprise-inspection-of-dornakal/article-18312

Tags: