మెనూ ప్రకారమే వడ్డించాలి
విశ్వంభర, సిద్దిపేట : జిల్లాలోని అన్ని గురుకులాల్లో కామన్ డైట్ మెనూ పాటిస్తూ రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు వడ్డించాలని జిల్లా కలెక్టర్ హైమావతి గురుకుల యాజమాన్యాలను ఆదేశించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీచేసి మధ్యాహ్నా భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నం, వెజిటేబుల్ బిర్యానీ, ఆలుగడ్డ తమాట, ప్రైడ్ గుడ్డు కూర, సాంబారు, పెరుగులను పరిశీలించారు. వెజిటేబుల్ బిర్యాని నాణ్యత పరిశీలిస్తూ బిర్యానీ నాణ్యత చాలా బాగుందని అభినందించారు. రోజువారీగా కామన్ డైట్ మెనూ పాటిస్తున్నారా, చేసిన ప్రతీ వంటకం రుచిగా ఉంటుందా అని ఆరా తీశారు. విద్యార్థుల హాజరు ప్రకారం కూరగాయలు, వంట సరుకులు కొలత ప్రకారం తీసుకోవాలని, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజన ప్రక్రియను ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వంటగది, డైనింగ్ హాల్ పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గురుకుల ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడ కూడా నీటి నిలువలు ఉండకుండా, దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించాలని ఆదేశించారు.