అభివృద్ధి కార్యక్రమాల ఎంపీడీవో పరిశీలన
విశ్వాంభర, పెద్ద శంకరంపేట: మండలంలోని గ్రామ పంచాయతీలలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మండల అభివృద్ధి అధికారి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్లు , వనమహోత్సవం కార్యక్రమంలో గుంతల తవ్వకం, మొక్కల నాటకం, స్వచ్ఛ భారత్ మిషన్ కింద సీఎస్సీలు , కమ్యూనిటీ సోక్ పిట్స్, వ్యక్తిగత సోక్ పిట్స్ నిర్మాణం, అలాగే ఘన వ్యర్థాల నిర్వహణ ఎస్ డబ్ల్యూ ఎం నిబంధనల ప్రకారం నాలుగు రకాల చెత్త సేకరణ, వేర్వేరుగా నిర్వహించే విధానం అమలుపై గ్రామాల వారీగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసి, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో సాధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి ప్రభుత్వ కార్యక్రమాలను నాణ్యతతో అమలు చేయడంతో పాటు, నాలుగు రకాల చెత్త సేకరణను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ ఓ జాకీర్ హుస్సేన్, ఏపీవో సంతోష్ కుమార్, ఈసీ నవాజుద్దీన్, టెక్నికల్ అసిస్టెంట్లు (TAs), పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.