రామన్నపేటలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సుభాష్ సెంటర్ వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పండ్లు పంపిణీ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పున్న జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న జగన్మోహన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, డిసిసి సెక్రెటరీ కొత్తపల్లి అబ్రహం కుమార్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టే సంతోష్ కుమార్, వనం చంద్రశేఖర్, సాల్వేర్ అశోక్, బొడ్డు సాలయ్య, మిర్జా బషీర్ బేగ్, జిల్లా వెంకటేశం, గుత్తా నర్సిరెడ్డి, రాయిని రమేష్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బైరబోయిన శోభ తదితరుల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.