కార్మికులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
- : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
విశ్వంభర, మహబూబాబాద్ : భవన నిర్మాణ,ఇతర అసంఘటిత రంగ కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు లేబర్ కార్డు పొంది ధీమాగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.రాజ్ కృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్ లేబర్ అడ్డా వద్ద కార్మికులకు చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అయన మాట్లాడుతూ..తెలంగాణ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ప్రతి కార్మికుడు తమ పేరును నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు (లేబర్ కార్డు) కలిగి ఉండటం వల్ల అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు సమకూరుతాయని వివరించారు.భవన నిర్మాణ రంగంలో నిత్యం ప్రమాదాల అంచున బతికే రోజువారీ కూలీలు మరియు అసంఘటిత కార్మికులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన సామాజిక భద్రతా పథకమే ఈ లేబర్ కార్డ్ విధానం అని తెలియచేశారు. ఐదు సంవత్సరాల బీమా కొరకు కేవలం 110 రూపాయలు మాత్రమే కార్మిక శాఖకు చెల్లించవలసి ఉంటుందన్నారు. ఇతర సమాచారం మరియు న్యాయపరమైన సలహాలు కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 15100 ను సంప్రదించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు మేకల శ్రీనివాస్ మరియు యుగంధర్ పాల్గొన్నారు.