నారాయణఖేడ్ మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి శ్రీకారం

విశ్వంభర, పెద్ద శంకరంపేట: నారాయణఖేడ్ మండల పరిధిలోని పల్గుతండా పంచాయతీ, జుక్కల్ గ్రామ శివారులో బుధవారం పలు అభివృద్ధి పనులకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. పల్గుతండాలో ఉపాధి హామీ పథకం నిధులతో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువలను ప్రారంభించిన ఎమ్మెల్యే, అనంతరం అంగన్‌వాడీ చిన్నారులకు ఉచిత యూనిఫాంలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ప్రతి గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన తెలిపారు. అనంతరం తండాకు చెందిన కర్ర మహిపాల్ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక జుక్కల్ శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే ప్రధాన మార్గంలో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. విద్యార్థులు, అధ్యాపకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను మంజూరు చేయించినట్లు తెలిపారు. విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పనులను నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-sanjiva-reddy-initiative-for-development-works-in-narayankhed-mandal/article-17116

Tags: