మైసంపల్లి లో ఘనంగా బొడ్రాయి ప్రతిష్ట
విశ్వంభర, హుస్నాబాద్ :సిద్దిపేట జిల్లా కోహెడ మండలం మైసంపల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి భూలక్ష్మి బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళలు భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో ఓడిబియ్యం పోసి మొక్కు చెల్లించుకున్నారు . గ్రామ దేవత బొడ్రాయి అనుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో విరజిల్లాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పకిడే సంపత్, ఉపసర్పంచ్ ఎలబోయిన రాజకుమార్ గ్రామస్తులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.