డంపింగ్ యార్డులో వ్యర్థాల శుద్ధి ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ 

 విశ్వంభర, సూర్యాపేట: గురువారం బాలెంల గ్రామ పరిధిలోని మున్సిపల్ డంపింగ్ యార్డును జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సందర్శించి తనిఖీ చేశారు. డంపింగ్ యార్డులో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఏ విధంగా శుద్ధి చేస్తున్నారో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన బయో మైనింగ్ యంత్రం పనితీరు, దాని ద్వారా తడి, పొడి వ్యర్థాలను ఎలా శుద్ధి చేస్తున్నారనే అంశాల పై అధికారులతో చర్చించారు.  డంపింగ్ యార్డు పరిసరాల్లో పేరుకుపోయిన తడి చెత్తను త్వరగా శుద్ధి చేయాలని,  ఎటువంటి చెత్త నిల్వ ఉండకుండా పరిశుభ్రతను నిరంతరం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు పరిశుభ్రమైన వాతావరణం అత్యంత అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్య, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి, మున్సిపల్ మరియు ఇంజినీరింగ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

🕒 26 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-collector-inspected-the-waste-treatment-process-at-the-dumping/article-17224

Tags: