ఆరెపల్లి రాజేందర్ కు సన్మానం

ఆరెపల్లి రాజేందర్ కు సన్మానం

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా డా. ఆరెపల్లి రాజేందర్ నియామకాన్ని స్వాగతిస్తూ బంధు సొసైటి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి బంధు సొసైటి రాష్ట్ర అధ్యక్షుడు పల్లెల వీరాస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి డా. అప్పికట్ల భరతభూషణ్ , తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ చీమ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సామాజిక సేవలో ఆరెపల్లి రాజేందర్ చేసిన కృషి విశేషమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టి సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించినట్లు వివరించారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతలను అప్పగించిందని పేర్కొన్నారు. ఆరెపల్లి రాజేందర్ మాట్లాడుతూ అప్పగించిన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ ఎస్సీ వర్గాల ఐక్యత కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్, వేల్పుల గౌతమ్ రాజ్, రాజేందర్, రాజగోపాల్, లక్ష్మీనారాయణ, ఇల్లెందుల శంకర్, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tribute-to-arepalli-rajender/article-15572

Tags: