దేశవ్యాప్త బంద్ లో పాల్గొన్న రామన్నపేట మెడికల్ దుకాణదారులు

విశ్వంభర, రామన్నపేట: దేశవ్యాప్త బంద్ లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు తమ మెడికల్ దుకాణాలను మూసివేశారు. ఆల్  ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మద్దతుగా నిలిచారు. ఆన్లైన్ ఫార్మసీలను రద్దు చేయాలని, కార్పొరేట్ సంస్థలకు అధిక మొత్తంలో భారీ డిస్కౌంట్ నిలిపి వేయాలని, నాణ్యమైన మందులనే విక్రయించాలని ప్రజారోగ్య పరిరక్షణకు పాటుపడుతున్న దేశవ్యాప్త 14 లక్షల కెమిస్టుల సమస్యలపై పరిష్కరించాలని  డిమాండ్ చేస్తూ బుధవారం దేశం మొత్తం బందుకు పిలుపిచ్చిన విషయం విదితమే. రామన్నపేట మండల కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు కేంద్రం చర్యలకు నిరసనగా ర్యాలీ నిర్వహించి మండల తహశీల్దార్ కార్యాలయంలో మెమోరాండం జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాపోలు రమేశ్ మండల కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అసోసియేషన్ సభ్యులు మాలిక్, నరసింహ, కరుణాకర్, రాజశేఖర్, రామేశ్వరం, రాంప్రసాద్, నగేష్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/medical-shopkeepers-of-ramannapet-participated-in-nationwide-bandh/article-15592

Tags: