"ప్రేరణ"కు వెళ్లి వచ్చిన'దీక్షిత్'
అభినందించిన ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు
విశ్వంభర, నెల్లికుదురు: కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గుజరాత్ లోని వాడ్ నగర్ లో నిర్వహిస్తున్న ప్రేరణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి నెల్లికుదురు పీఎం శ్రీ ఆదర్శ పాఠశాలలో 9వ, తరగతి విద్యార్థి సింగనం దీక్షిత్ ఈనెల 10 నుంచి 16 వరకు వారం రోజులపాటు పాల్గొని తిరిగి వచ్చాడు. దీంతో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ జి ఉపేందర్ రావు దీక్షిత్ ను మంగళవారం అభినందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఫిబ్రవరి 17న జిల్లా కేంద్రంలో నిర్వహించి ప్రేరణ కార్యక్రమంలో అసాధారణ ప్రతిభ కనబరచడంతో గుజరాత్ ప్రేరణ కార్యక్రమానికి ఎంపికయ్యాడన్నారు. ప్రేరణలో భారతీయ విద్యా విధాన సూత్రాలను, వారసత్వం, నూతనత్వం మేళవించే దేశ ఔన్నత్యాన్ని, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అనుభవ పూర్వక స్ఫూర్తిదాయక మైన వాటిపై క్షేత్రస్థాయిలో బాలునికి అవగాహన కల్పించారన్నారు. ఇంతకీ మహత్తరమైన ప్రేరణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి తమ పాఠశాల విద్యార్థి ఎంపికై వెళ్లి రావడం సంతోషదాయకమని ప్రిన్సిపాల్ తో పాటు ఉపాధ్యాయ బృందం అభినందించింది.