టీబీ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం
విశ్వంభర, సూర్యాపేట: జిల్లాలో టీబీ ముక్త భారత్ అభియాన్ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పెండెం వెంకట రమణ సమీక్షించారు. ఇప్పటివరకు 54 రోజుల ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. జిల్లాలోని 21 గ్రామ పంచాయతీలను టీబీ రహితంగా మార్చినట్లు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 6,818 మందికి ఎక్స్-రేలు, 2,941 మందికి ల్యాబ్ పరీక్షలు నిర్వహించి, 149 మంది బాధితులను గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.