బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

  • ఎమ్మెల్యే డా.మురళి నాయక్
    నెల్లికుదురు లో డీసీసీ బ్యాంకు ప్రారంభం

విశ్వంభర, నెల్లికుదురు: కొత్తగా ఏర్పాటు చేసిన డిసిసి బ్యాంక్ సేవలను రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే డా.భూక్య మురళీ నాయక్ అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురులో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసి) 38వ శాఖను స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, పిఎసిఎస్ చైర్మన్ లు కాసం లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి,గుండా వెంకన్న, పొనుగోటి దేవేందర్ రావు,డిసీసీబీ జిఎం ఉషశ్రీ, డి సి వో వెంకటేశ్వర్లు నాబార్డు డి డి ఎం సాయిరాం ఏటీఎం స్వాతి, మేనేజర్ టి.శోభన్ లతో కలిసి ఎమ్మెల్యే మురళి నాయక్ మంగళవారం ప్రారంభించారు. స్థానిక మేనేజర్ టి.శోభన్ ను మేనేజర్ ఛాంబర్ సీట్లో ఎమ్మెల్యే కూర్చోబెట్టి శాలువాతో సన్మానించారు.పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో  ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకార రంగం బలోపేతానికి,రైతాంగ సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు.డిసిసి బ్యాంకు వాణిజ్య బ్యాంకులతో పోటీపడుతూ తక్కువ వడ్డీకే రైతులకు పంట,బంగారు, విద్యా రుణాలను అందిస్తుందన్నారు. ప్రతి రైతుకు రుణం మంజూరు చేయాలని బ్యాంకుకు, అదే సమయంలో తీసుకున్న రుణాలు తిరిగి సకాలంలో చెల్లించాలని ఎమ్మెల్యే సూచించారు.

బిఆర్ఎస్ తీరు ఆక్షేపణీయం
 
రాష్ట్రంలోని బిఆర్ఎస్ తీరు అక్షేపనీయంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులను ఓర్వలేక అవాకులు చవాకులు పేలుతోందని విమర్శించారు. ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లు పట్ల ప్రత్యేకత తీసుకున్నట్లు చెప్పారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనే దురుద్దేశంతో రాష్ట్రానికి అవసరమైన యూరియాను ఇవ్వడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషితో రైతులకు యూరియా అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో డిటి శ్రీనాథ్, నాయకులు యాదవ రెడ్డి,ప్రభాకర్ గౌడ్,బాలాజీ,లక్ష్మారెడ్డి, వ్యాపారవేత్త వేముల బాబ్జి వివిధ గ్రామాల సర్పంచులు,రైతులు,డిసిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More పెట్రో ధరలు తగ్గంచాలి:  సీపీఎం

🕒 20 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/take-advantage-of-the-banks-services/article-15516

Tags: