ఉద్యమకారుల హక్కులు సాధించేంతవరకు కొట్లాడుతా 

  • మాజీ ఎంఎల్ సి రాములు నాయక్ 

విశ్వంభర, బషీర్ బాగ్: తెలంగాణ ఉద్యమకారుల హక్కులు సాధించేంతవరకు కొట్లాడుతానని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉద్యమకారుల కమిటీ సభ్యులు, మాజీ ఎంఎల్ సి రాములు నాయక్ అన్నారు. బుధవారం బషీర్ బాగ్  ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వొరుగంటి ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఉద్యమకారుల సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేందుకు సిఎం రేవంత్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. అందుకే, ప్రత్యేకంగా ఉద్యమకారుల కమిటీని నియమించారని, అందులో తాను సభ్యుడిగా ఉండటం సంతోషంగా ఉన్నదన్నారు. ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, గుర్తింపుకార్డులు, ప్రతి నెల పెన్షన్, హెల్త్ కార్డు, ఉచిత రవాణా వంటి అనేక డిమాండ్లను సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రచారమే తప్ప, పనులు జరగకపోవేన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రచారం తక్కువ, పనులు వేగంగా జరుగుతాయన్నారు. శాంతియుత పద్ధతిలో ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించుకొంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆనంద్ మాట్లాడుతూ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులివ్వాలని, ప్రతి నెల రూ.25 వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలన్నారు. అదేవిధంగా 250 గజాల ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.10ల క్షల ఆర్థిక సాయం చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఉద్యమకారుల కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డి,, ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొంతం యాదిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్, మహిళా అధ్యక్షురాలు జానకి రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.వి. కృష్ణారావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు బూందిల ఇంద్రకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్ గౌడ్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/they-will-fight-until-the-rights-of-the-activists-are/article-15584

Tags: