మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ 

  •  ఆస్తి కోసమే అక్కను హతమార్చిన తమ్ముడు
  • వివరాలు వెల్లడించిన  డిఎస్పి ప్రసన్నకుమార్

విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట డివిజన్ డిఎస్పీ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్సై ఐలయ్య తో కలిసి డి.ఎస్.పి ప్రసన్నకుమార్ మహిళ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్  వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు మండలం  తుమ్మలపెనపహడ్ గ్రామానికి చెందిన సరబి సైదులు, అతని అక్క అంజమ్మ ఇరువురి మధ్య భూ తగాదా ఉన్నది, ఈ విషయంలో అక్కను తప్పిస్తే ఆస్తి తన సొంతం అవుతుంది అని భావించిన సైదులు సోమవారం రోజు ఉదయం తుమ్మలపెనపహాడ్ గ్రామంలో పనికి వెళుతున్న అక్కపై విచక్షణా రహితంగా కత్తితో దాడిచేసి హత్యచేశాడు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సురబి సైదులు, ప్రధాన నిందితుడి  భార్య ధనలక్ష్మి, కుమారుడు శివతేజ, బావమర్ధి కొండ భీమయ్య ల పై కేసు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. అంజమ్మను తప్పిస్తే ఆస్తి దక్కుతుందని పథకం ప్రకారం హత్య చేశారు. దర్యాప్తు నిర్వహించి నిందితులను ఈరోజు బృందావనపురం గ్రామంలో ఏ4 నిందితుడు కొండ భీమయ్య ఇంట్లో ముగ్గురు నిందితులు సైదులు, ధనలక్ష్మి, శివతేజ లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. నాలుగవ నిందితుడు కొండ భీమయ్య పరారీలో ఉన్నాడు. ఇతని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. సంఘటనపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నందు హత్య కేసు నమోదు చేసి ఎస్పీ నర్సింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు.  

కేసు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. ఆత్మకూర్- ఎస్  మండలము లోని  తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన సురభి బుచ్చయ్య, లక్ష్మమ్మలకు ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకు సంతానము. వారి చిన్న కూతురు ఉమ వివాహ సమయములో పసుపు కుంకుమల క్రింద ఎ 2.20 గుంటల వ్యవసాయ భూమి ఇవ్వగా ఉమ పేరున ఎ 2.03 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కాగా మిగిలిన 17 గుంటల భూమి రిజిస్ట్రేషన్ కాలేదు. ఆ  17 గుంటల భూమి  రిజిస్ట్రేషన్ విషయములో గత కొంత కాలము నుండి ఉమ కుటుంబానికి, ఆమె అన్న సురభి సైదులు కుటుంబానికి మధ్య  గొడవలు జరుగుతున్నాయి. 17 గుంటల భూమి ఉమకు రిజిస్ట్రేషన్ చేయాలని ఉమ పెద్ద అక్క సురభి అంజమ్మ ఉమకు సపోర్ట్ చేస్తూ తన తమ్ముడు అయిన సురభి సైదులుతో గోడవపడుచున్నది.  భూమి తగాదా విషయములో 2025 జులై నెలలో సురభి సైదులు, అతని బార్య, వారి కొడుకు, వారి  బందువులు కలిసి  సురభి అంజమ్మను, ఉమను కొట్టి గాయపరచగా వారి పై ఆత్మకూర్ యస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినది. కేసు ప్రస్తుతము సూర్యాపేట కోర్ట్ లో పెండింగ్ లో ఉన్నది. సురభి సైదులు, అతని బార్య సురభి ధనలక్ష్మి, అతని కొడుకు సురభి శివ తేజ, అతని బావమరిది కొండ భీమయ్య కలిసి సురభి అంజమ్మను, ఉమను హత్య చేస్తే  ఉమ పేరున ఉన్న భూమి మొత్తము సైదులుకు దక్కుతుంది అని కుట్ర పన్నారు. వారి ప్లాన్ లో భాగంగా ఈ నెల  18న  ఉదయము సుమారు 06:00 గంటల సమయములో సురభి అంజమ్మ ఉపాధి హామీ కూలి పనులకు వెళ్తుండగా  సురభి సైదులు కత్తి తో  అంజమ్మ పై దాడి చేసి హత్య చేశాడు .

Read More జనగణనలో భాగస్వాములు కావాలి

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/three-accused-arrested-in-womans-murder-case/article-15596

Tags: