సైబర్ మోసాలపై గిరిజనులకు అవగాహన
- సూర్యా పేట టౌన్ సిఐ వెంకట్
విశ్వంభర, సూర్యాపేట: జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు సూర్యాపేట డి ఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట టౌన్ సిఐ వెంకట్, వన్ టౌన్ ఎస్ఐ ఏడుకొండలు, సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం 24, 25, వార్డులలో రోడ్డు భద్రత, సైబర్ మోసాలు, మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన మొదలగు అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ సిఐ వెంకట్ మాట్లాడుతూ, ప్రేమ నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి, ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి, సమాజంలో సైబర్ మోసాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని సైబర్ మోసాల నివారణలో నేటి పౌరులు రేపటి సైబర్ మోసాల నివారణ వారియర్స్ గా పని చేయాలి అన్నారు. మొబైలు ఇంటర్నెట్ ద్వారా జ్ఞానాన్ని పొందాలే తప్ప సోషల్ మీడియా ప్రభావానికి గురికావద్దని అన్నారు. సైబర్ మోసగాళ్లు ఆన్లైన్ వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని ఆన్లైన్ వ్యాపారం పేరు చెప్తే ఎవరు నమ్మి పెద్దమొత్తంలో డబ్బులు పెట్టుబడులు పెట్టవద్దు అని, ఆర్థికంగా నష్టపోవద్దని కోరారు. అలాగే ఇంటర్నెట్ కాల్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇంస్టాగ్రామ్ ద్వారా లింకులు పంపించి మోసాలకు పాల్పడుతున్నారని వీటి మోసాల గురించి తల్లిదండ్రులకు మీ చుట్టుపక్కల ఉన్న వారికి తెలియజేయాల్సి ఉన్నదని, సైబర్ వారియర్స్ గా ఉండాలన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది అబద్ధమని డిజిటల్ అరెస్ట్ అంటూ ఎవరైనా అపరిచితులు ఫోన్ చేసి ఎస్బి, సిబిఐ, సిఐడి దర్యాప్తు సంస్థల పేర్లు చెబుతూ మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాము అంటే నమ్మవద్దు అన్నారు. అలాగే డ్రగ్స్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని యువత వీటి బారిన పడి మంచి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అన్నారు ఈ డ్రగ్స్ కు దూరంగా ఉండి మంచి అలవాటు మంచి స్నేహితులను కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 25వార్డ్ కౌన్సిలర్ కోడి శిరీష, 24 వార్డ్ కౌన్సిలర్ మన్యం అరుణ, పోలీస్ సిబ్బంది,శ్రీనివాస్, నరేష్, పురుషోత్తం, ఈశ్వర్ సింగ్, పోలీసు కళాబృందం వారు సామాజిక అంశాల గురించి సామాజిక రుగ్మతల గురించి సామాజిక భద్రత గురించి పాటలతో అవగాహన కల్పించారు.