జనగణన సమర్ధవంతంగా నిర్వహించాలి
- కమీషనర్ సి.ఎచ్. హన్మంత రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంత్ రెడ్డి అన్నారు. పట్టణములో సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్న సర్వే విధానాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఇంటి వివరాలను కచ్చితంగా తప్పులు లేకుండా నమోదు చేయాలని సూర్యాపేట అభివృద్ధి ప్రణాళికలకు ఇవి కీలకమైన ఆధారమని ఎలాంటి పొరపాట్లు సమాచార లోపాలు చోటు చేసుకోకుండా ఉండాలని వారికి జన గణన ప్రాధాన్యాన్ని వివరించాలని తెలిపారు. పట్టణములో సర్వే నిర్వహిస్తున్న సూపర్వైజర్లు మరియు ఎన్ని మారేటర్లందరూ ఒక్క ఇంటిని కూడా వదలకుండా అన్నిటిని కూడా గణనలోకి తీసుకురావాలని పట్టణ ప్రజలకు సర్వే ప్రాధాన్యతను వివరించి ఖచ్చితమైన సమాధానాలు రాబట్టాలని ఎక్కడ ఉండేవారిని వారిని అక్కడే నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య టి పి బి ఓ అఖిల్ రెడ్డి డీలింగ్ అసిస్టెంట్ గోపారపు రాజు సూపర్వైజర్లు కందుకూరి. శివశంకర్ ఎన్నిమరైటర్లు వార్డ్ కౌన్సిలర్ జహీర్ తదితరులు పాల్గొన్నారు.