ఎంపీడీవోను కలిసిన టీఎన్‌జీఓస్ ప్రతినిధులు
విశ్వంభర, మహేశ్వరం : టీఎన్‌జీఓస్ మహేశ్వరం తాలూకా యూనియన్ ప్రతినిధులు బుధవారం మహేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఎన్. శారదమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన శారదమ్మకు యూనియన్ ప్రతినిధులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్‌జీఓస్ అధ్యక్షులు టి. శ్రీధర్ రెడ్డి, కోశాధికారి జి. అమృత వర్షిణి ఉద్యోగుల సంక్షేమం, కార్యాలయ పరిపాలనా సమన్వయం, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలపై ఎంపీడీవోతో చర్చించారు, మండల పరిధిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగేందుకు పరస్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి సహకరిస్తామని శారదమ్మ హామీ ఇచ్చినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, కార్యాలయాల్లో సౌకర్యాల మెరుగుదల, పరిపాలనా వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.