ప్రజల సౌకర్యార్థం నాలాపై బ్రిడ్జిలు నిర్మాణాలు చేపడుతున్నాం 

  •  మున్సిపల్ ఛైర్ పర్సన్  మొరిశెట్టి నివేదిత లక్షాధి 

విశ్వంభర, సూర్యాపేట:  ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించేందుకు నాలాపై బ్రిడ్జి కల్వర్టుల నిర్మాణ పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నామని మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి తెలిపారు. బుధవారం స్థానిక వార్డు నెంబర్ 47లో టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.50 లక్షలతో నిర్మిస్తున్న నాలాపై బ్రిడ్జి పనులను మున్సిపల్ కమిషనర్ సీహెచ్ హన్మంతరెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నాలాపై తగిన సంఖ్యలో బ్రిడ్జిలు లేకపోవడంతో ప్రజలతో పాటు కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు 60 ఫీట్ల రోడ్డునుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నాలాపై రెండు బ్రిడ్జి కల్వర్టులను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ నిర్మాణాలతో ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్, 47వ వార్డు కౌన్సిలర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, మున్సిపల్ ఈఈ కిరణ్, డీఈ సత్యారావు, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, టీపీఓ సోమయ్య, కౌన్సిలర్లు కొణతం రాజేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫారూక్, గుణగంటి సతీష్, పొలగని కృష్ణా, నరేందర్ నాయుడు, మున్సిపల్ ఏఈ రాజురెడ్డి, ఎండీ గౌసుద్దీన్, ఎస్‌ఎస్‌ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bridges-are-being-constructed-on-nala-for-the-convenience-of/article-15588

Tags: