స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
విశ్వంభర, బషీర్ బాగ్: అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తోపాటు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదరుర్శులు వింజమూరి రాఘవాచారి, చేపూరి వెంకటస్వామి లు కోరారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు గడుస్తున్నా అట్టడుగు వర్గాలకు న్యాయం జరగడం లేదని అన్నారు. జ్యూవెలరి రంగంలోకి కార్పొరేట్ శక్తుల రాకతో ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. 50 ఏళ్ళు దాటిన స్వర్ణకారులకు రూ.4 వేల పెన్షన్ అందజేయాలని కోరారు. 2029లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వర్ణకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. తద్వారా ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసి పక్క రాష్ట్రాలకు అధ్యయనానికి పంపారని గుర్తు చేశారు. వైఎస్అర్ బ్రతికి ఉంటే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు అయ్యేదాన్ని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్అర్ హయాంలో తెచ్చిన జీవో 272 ను సవరించి అమలు చేయాలన్నారు. ఈనెల 23న జరిగే కేబినెట్ మీటింగ్ లో కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో అసెంబ్లీ ముట్టడి తోపాటు 33 జిల్లాల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చెపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం నేతలు చంద్రశేఖర్, కిషన్, మనోరమ, భీష్మాచారి, ఆంజనేయచారి, సంతోష్, వేణుగోపాల్ చారి, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.