బీసీల అభివృద్ధికి దోహదం

బీసీల అభివృద్ధికి దోహదం

విశ్వంభర, విద్యానగర్ : జనగణనలో కులగణన చేపట్టడాన్ని వ్యతిరేకించిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడం బీసీల అభివృద్ధికి కీలకమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాదు విద్యానగర్ బీసీ భవన్‌లో బుధవారం జరిగిన బీసీ నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కులగణన విధానపరమైన అంశమని, ఇందులో న్యాయస్థాన జోక్యం అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర వాదనలు వినిపించగా, వాటిని కోర్టు అంగీకరించిందన్నారు. సమాజంలో కులాల ఆధారంగా ఉన్న సామాజిక, ఆర్థిక అసమానతలను గుర్తించి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటే కులాల వారీ గణాంకాలు అవసరమని పేర్కొన్నారు. మొదటి దశలో ఇండ్ల లెక్కింపు, రెండో దశలో కులగణన చేపట్టనున్నట్లు తెలిపారు. కులగణనపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు తప్పని అన్నారు. తాజా తీర్పుతో వాస్తవ పరిస్థితి వెలుగులోకి వచ్చిందన్నారు. వెనుకబడిన వర్గాల విద్యా, ఉద్యోగ, ఆర్థిక పురోగతికి సరైన విధానాలు రూపొందించేందుకు ఈ గణాంకాలు కీలకమని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, మోడీ రాందేవ్, భీమరాజు, నిఖిల్ పటేల్ తదితరులు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/contribute-to-the-development-of-bcs/article-15568

Tags: