మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి : వి హెచ్
విశ్వంభర, అంబర్‌పేట : మహిళలు అన్ని రంగాల్లో ముందుండి సమాజాన్ని ముందుకు నడిపించాలని బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు పిలుపునిచ్చారు. ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం హైదరాబాదు అంబర్‌పేట మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ ద్వారా మహిళా సాధికారత సాధ్యమవుతుందని, కార్యకర్తలు ఆ దిశగా చురుకుగా పనిచేయాలని సూచించారు. సమాజంలో మహిళల పాత్ర మరింత బలపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎర్రబెల్లి స్వర్ణక్క మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ పాత్ర కీలకమని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేయడంలో కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్ విభాగం 1984 సెప్టెంబర్ 15న ప్రారంభమై మహిళల రాజకీయ, సామాజిక అభివృద్ధికి వేదికగా నిలిచిందని వివరించారు. మహిళా సాధికారతతోనే దేశ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్, ఫెరోజ్ ఖాన్, విజయ రెడ్డి, ఉస్మాన్, వినోద్, కేశం నాగరాజు గౌడ్, దుర్గేష్ గౌడ్, మహాలక్ష్మి రామన్ గౌడ్, సుగుణ, అంజలి, వెంకట సుబ్బమ్మ, రజిత, నర్మదా సింగ్, అస్మా, నీలం పద్మ, రాజనోళ్ల లక్ష్మి, జ్యోతి భీమ్ భరత్, పుస్తకాల కవిత, మారి, సోనియా, స్వరూప, మాధవి, ఫర్జానా బేగం, శ్రీదేవి, ప్రియాంక, రూపాలి, ప్రసన్న భారతి, గౌసియా, మాధురి, అనురాధ, సెలీనా, భవాని, కవిత, దుర్గ, ఆర్ లక్ష్మణ్ యాదవ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, రాజేష్ అగర్వాల్, రషీద్ ఖాన్, దిడ్డి రాంబాబు, గరిగంటి రమేష్, పులి జగన్ తదితరులు పాల్గొన్నారు.