నీట్ పేపర్  లీకేజీపై న్యాయ విచారణకు డిమాండ్

విశ్వంభర, బాగ్ లింగంపల్లి: నీట్ పేపర్ లీకేజీ ఘటన కేంద్ర విద్యా విధానాల వైఫల్యానికి నిదర్శనమని వామపక్ష విద్యార్థి సంఘాలు విమర్శించాయి. “ఒకే దేశం–ఒకే పరీక్ష” విధానం వల్ల పరీక్షా అక్రమాలు, కోచింగ్ మాఫియా దందాలు పెరిగాయని పేర్కొన్నాయి. నీట్‌ను రద్దు చేసి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేసి పారదర్శక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. నాగరాజు, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్, పొడపంగి నాగరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో విద్యార్థి, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ విద్యను కార్పొరేటీకరణ దిశగా నెడుతూ కేంద్రం రాష్ట్రాల హక్కులను హరిస్తోందని విమర్శించారు. వరుస పేపర్ లీకేజీలు ఎన్టీఏ వైఫల్యాన్ని బయటపెట్టాయని తెలిపారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. పరీక్షల తర్వాత విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతు న్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఒకే పరీక్ష విధానం అమలు చేయడం అన్యాయమన్నారు. గ్రామీణ విద్యార్థులు నష్టపోతుండ గా కోచింగ్ మాఫియా లాభపడుతోందని తెలిపారు. ఇతర నాయకులు పేపర్ లీకేజీలపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని, పరీక్షల నిర్వహణ హక్కు రాష్ట్రాలకు ఇవ్వాలని, రీ-నీట్‌ను స్వతంత్ర సంస్థతో నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె. మణికంఠ రెడ్డి, కె. పృధ్వీ, పి. మహేష్, పల్లె మురళీ, దామెర కిరణ్, కె. అశోక్ రెడ్డి, లెనిన్, నాగేందర్, డా. గ్యార నరేష్, రెహమాన్, క్రాంతి, చైతన్య, పయాజ్, హారీష్, ధరణి, అశ్వనీ, రిషిక్, ప్రసాద్, జాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/demand-for-judicial-inquiry-into-neet-paper-leakage/article-15560

Tags: