నూతన గ్రామ కాంగ్రెస్ కమిటీ ల ఏర్పాటు

నూతన గ్రామ కాంగ్రెస్ కమిటీ ల ఏర్పాటు

విశ్వంభర, జనగాం: దేవరుప్పుల మండలం లో టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి,  పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు దేవరుప్పుల మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో నూతన గ్రామ కాంగ్రెస్ కమిటీ లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల జరిగిన బంజర గ్రామ సర్పంచ్ ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన  గడ్డం పరంధాములు ను బంజర గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ,అప్పిరెడ్డి పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూకట్ల కొమురయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పరంధాములుకు ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల గ్రామ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచే మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామాల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పేద ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని, గ్రామాల అభివృద్ధి  ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి  కృషి ఫలితమేనని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు ఆమె నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలోజనగామ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు తోటకూరి పాండుకృష్ణ, నల్లకుంట భాస్కర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు రసూల్, ఓడపల్లి రవి, దావెర అనిల్ కుమార్, బోనగిరి యాకస్వామి, రాంబోజి గూడెం సర్పంచ్ పరిధుల భాస్కర్, అనంతోజు రాజయ్య, రామచంద్రు నాయక్, మొటికే చంద్రశేఖర్, దౌపాటి నరసయ్య, దౌపాటి రవి, గుగులోతు నరేందర్,దేవరుప్పుల మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ గనుపాక ప్రదీప్ తదితర మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

🕒 21 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/formation-of-new-village-congress-committees/article-15606

Tags: