సిసి రోడ్లు , డ్రైనేజీ పనులు  విడతలవారీగా  పూర్తి చేస్తాం

సిసి రోడ్లు , డ్రైనేజీ పనులు  విడతలవారీగా  పూర్తి చేస్తాం

  • : సర్పంచ్ నవీన్ 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం గ్రామ పంచాయతీలో  9వ వార్డు లో మూడు లక్షలతో  గ్రామ పంచాయతీ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్  మునగపాటి నవీన్   పాలకవర్గం, గ్రామ పెద్దలతో కలిసి  ప్రారంబించడం జరిగింది, ఈ సందర్భంగా  గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్  మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి వార్డులో గ్రామ ప్రజల అవసరాలకుఅనుగుణముగా సీసీ రోడ్డు పనులు, డ్రైనేజీ పనులను విడతల వారీగా పూర్తి చేస్తున్నామని, అధెవిధముగా గ్రామంలో  వేసవి కాలములో ఎక్కడ కూడా త్రాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకొని ప్రతి వార్డులో బోర్ మోటార్స్ డ్రిల్లింగ్ చేయడముతో, పాటు నూతన మోటార్ పంప్ సెట్స్ బిగించడము జరిగిందని తెలియజేశారు. గ్రామంలో  ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా తగిన మౌలిక వసతులు కల్పిస్తానని తెలిపినారు. ఈ కార్యక్రమములో సర్పంచ్ మునగపాటి నవీన్, గ్రామ ఉప సర్పంచ్  జొరల రమేశ్ , వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, నాయకులు బీజేవైఎం ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రావణ్, బి ఆర్ఎస్  గ్రామ శాఖ అధ్యక్షులు కటికల మహేందర్, పి ఎ సిఎస్  మాజీ డైరెక్టర్ కడమోని ప్రభాకర్, కాట్నం పర్వతాలు, కటికల శ్రీనివాస్, కావాలి జంగయ్య, సున్నం కృష్ణ, ఆవులకాడి శ్రీశైలం, సున్నాల గణేష్  గ్రామస్థులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags: